
కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని నిన్న 25వ తారీకున టిడిపి నినదించిన చలో కడప కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వైఖరిని నిలదీయడానికి కడప కలెక్టరేట్ కు బయలుదేరిన టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్టు చేయటానికి నిరసిస్తూ విద్యార్థులు మరియు నిరుద్యోగ పట్టభద్రులు ఆందోళన చేపట్టారు. గోవర్ధన్ రెడ్డి మీడియాలో మాట్లాడుతూ అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని, ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని, మెగా డీఎస్సీని నిర్వహించాలని, ప్రైవేట్ టీచర్లకు టెట్ పాస్ అవ్వాలనే నిబంధనను రద్దు చేయాలని. కడప ఉక్కు పరిశ్రమ పనులను వెంటనే ప్రారంభించి కడప జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట పట్టభద్రుల శ్రమ దోపిడీని ఆపివేయాలని, వీరందరినీ పర్మినెంట్ చేయాలని, జగన్ ప్రభుత్వం పట్టభద్రుల పట్ల తమ వైఖరిని మార్చుకోకపోతే, యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




























































Leave a comment